AP Job Calendar: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏపీ సర్కారు జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది.
ఇందులో భాగంగా ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సమాచారాన్ని హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. కొన్ని విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలను ఇప్పటికే నమోదు చేశారు. మంజూరైన పోస్టులతో పాటు ఖాళీల వివరాలను అందులో పెడుతున్నారు. (AP Job Calendar)
అనంతరం వాటిని ఆయా హెచ్‌వోడీలు నిర్ధారించాల్సి ఉంటుంది. అన్ని శాఖల్లో కలిపి దాదాపు 30 శాతం ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నింట్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. మొత్తం కలిపి 99 వేల ఖాళీలు ఉండనున్నట్లు అంచనా.
Also Read: Madavi Hidma: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా హతం
ప్రస్తుతం 24 విభాగాలు ఖాళీల వివరాలను నిర్ధారించాల్సి ఉండగా, మరో 21 శాఖల వివరాల రికార్డు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవి అన్నీ పూర్తయ్యాక మొత్తం ఖాళీలు ఎన్నన్న వివరాలు కచ్చితమైన రీతిలో తెలుస్తాయి. రెవెన్యూలో 13 వేల ఖాళీలు ఉన్నాయి.
ఉన్నత విద్యా శాఖలో 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో 27 వేలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే, ఇతర విభాగాల నుంచి అన్నీ వివరాలు తీసుకున్నాక ఏపీ సర్కారు జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది.