ఏపీ ICET ఫలితాలు విడుదల

  • Publish Date - May 8, 2019 / 06:00 AM IST

ఏపి ICET ఫలితాలను బుధవారం (మే 8, 2019) ఉదయం  విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేసారు. MCA, MBA లలో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు 48,445 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఫలితాలను ICET అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ICET పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను sche.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.   
 
ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏపీ ICET పరీక్ష నిర్వహించారు. ఎస్వీయూ నిర్వహించిన ఈ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు రెండు సెషన్లలో జరిగింది. ఈ పరీక్షకు 52,736 మంది దరఖాస్తు చేసుకోగా, 48,445 మంది హాజరయ్యారు. ఏప్రిల్ 27 ఐసెట్ ప్రాథమిక కీని విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం మే 8న ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.