Inter Results: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాలు ఎప్పుడు అంటే..!
58 లక్షల పేపర్లలో 8 లక్షల పేపర్ల మూల్యాంకనం పూర్తయినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
- Naveen
- Published On : March 24, 2026 / 06:21 PM IST
Inter Results: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఫలితాల తేదీ వెల్లడైంది. ఏప్రిల్ 17న ఇంటర్ రిజల్ట్స్ వెలువడనున్నాయి. రేపటితో ఇంటర్ ఎగ్జామ్స్ ముగియనున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు వాల్యుయేషన్ చేపట్టింది. ఫలితాలను ఏప్రిల్ 17న విడుదల చేసేలా కసరత్తు చేస్తోంది.
58 లక్షల పేపర్లలో 8 లక్షల పేపర్ల మూల్యాంకనం పూర్తయినట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. సిలబస్ మారడం, సబ్జెక్టలు ఎలెక్టివ్ విధానం వల్ల పరీక్షలు విడివిడిగా పెట్టాల్సి వచ్చింది. దీని వల్ల 30 రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. కాగా మే మొదటి వారంలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశముంది. మార్చి 22 నుంచి రాష్ట్రంలో ఇంటర్ జవాబు పత్రాల వాల్యూయేషన్ మొదలు పెట్టారు.
మార్చి 25తో పరీక్షలు పూర్తి కానున్నాయి. వీలైనంత త్వరగా రిజల్ట్స్ విడుదల చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు, ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 25 వరకు జరుగుతాయి.
Also Read: యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుంది: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. జనం ప్రిపేర్ అవ్వాల్సిందేనా?
