ఏపీలో పదోతరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (మే 14, 2019) ఉదయం 11 గంటలకు విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక అన్నీ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లతో తమ ఫలితాలను చూడవచ్చు. అలాగే ఫైబర్‌నెట్ టీవీలో కూడా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న టీవీలో కూడా విద్యార్థి నెంబరు టైపు చేయగానే ఫలితాలు కనబడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ సంవత్సరం ఏపీలో పదోతరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల కోసం మొత్తం 6,21,634 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 6,18,525 మంది పరీక్షలకు హాజరయ్యారు. అభ్యర్ధులు ఫలితాలను www. bseap.org, rtgs.ap.gov.in లో తెలుసుకోవచ్చు.