AP ECET-2019 నోటిఫికేషన్ విడుదల

  • Publish Date - February 12, 2019 / 05:05 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2019-20 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు JNTU అనంతరపురం ‘APECET-2019’ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం BE, B-TECH, B-Pharmacy కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. డిప్లొమా (ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ), BSC(MAT) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

‘APECET-2019’ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలు కోరువారు దరఖాస్తు ఫీజు రూ.550 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. AP ఆన్‌లైన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 

అభ్యర్థులు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 

ప్రవేశ కోర్సులు: 
BE/B-TECH/ B-Pharmacy