Jobs In Warangal NIT: వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. నెలకు రూ.37 వేలు జీతం.. మరిన్ని వివరాలు మీకోసం

వరంగల్‌ ఎన్ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

NIT Warangal recruitment 2025

నిరుద్యోగులకు వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై 09వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు.

పోస్టులు, అర్హత వివరాలు

పోస్టు: జూనియర్ రీసెర్చ్ ఫెలో

అర్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు యూజీ, పీజీలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వేతన వివరాలు: ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్తలకు నెలకు రూ.37,000 జీతం అందుతుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: అధికారిక వెబ్ సైట్ ramyaaraga@nitw.ac.in./ దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: జులై 09, 2025.