Applications for Section Officer posts in AP Forest Department have started.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 100 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన ఈ నోటిఫికేషన్ ను సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యింది. కాబట్టి, అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్ట్ 17వ తేదీలోపు అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default నుంచి అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
వృక్షశాస్త్రం/ఫారెస్ట్/హార్టీ కల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ/మ్యాథ్స్, స్టాటిస్టిక్స్/జియాలజీ/అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్ గా డిగ్రీ పాసై ఉండాలి.
ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష:
అభ్యర్థులు కచ్చితంగా 163 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
చాతీ 84 Cms ఉండాలి.. గాలి పీల్చినప్పుడు 5 Cms పెరగాలి.
మహిళా అభ్యర్థుల ఎత్తు 150 Cms ఉండాలి
చాతీ చుట్టుకొలత 79 Cms తగ్గకుండా గాలి పీలిచినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి.
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ. 250, పరీక్ష ఫీజు రూ. 80 చెల్లించాల్సి ఉంటంది.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 01.07.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతన వివరాలు:
ఈ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 32,670 నుంచి రూ.1,01,970 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటాయి.