ఏపీ అటవీశాఖలో FBO పోస్టులు..

  • Publish Date - February 15, 2019 / 09:34 AM IST

ఏపీ అట‌వీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 3న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 26లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. మార్చి 27 దరఖాస్తుకు చివరితేది. 

రెండంచెల రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్) ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. స్క్రీనింగ్ పరీక్షను మే 26న, మెయిన్ పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్షను ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఒకవేళ స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25 వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్‌‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు. 

* పోస్టుల వివరాలు..

                        పోస్టులు           పోస్టుల సంఖ్య
ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్                  330
అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్                100
మొత్తం పోస్టులు (పాతవి 26 + కొత్తవి 404)                430

 

* అర్హత‌: 
ఇంట‌ర్ విద్యార్హత ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు త‌ప్పనిస‌రిగా కలిగి ఉండాలి. 

* వ‌య‌సు:
01.07.2019 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

* దరఖాస్తు ఫీజు: 
అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాలి. SC, ST, BC, తెల్లరేషన్ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు   చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. 

* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

* ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం     05.03.2019
ఫీజు చెల్లించడానికి చివరితేది     26.03.2019
దరఖాస్తుల సమర్పణకు చివరితేది      27.03.2019
స్క్రీనింగ్ పరీక్ష తేది      26.05.2019
మెయిన్ పరీక్ష తేది        ఆగస్టులో