ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షను ఏప్రిల్ 21న నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ను APPSC గురువారం (ఏప్రిల్ 25, 2019) సాయంత్రం వెల్లడించింది. ఏప్రిల్ 21 న పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ IV) స్క్రీనింగ్ టెస్ట్‌కు మొత్తం 4,95,526 మంది దరఖాస్తు చేసుకోగా మొత్తం 2,94,966 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10.00 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. నెలరోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఆగస్టు 2న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
వీటిపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే మే 2 లోగా తెలియజేయాల్సి ఉంటుంది. APPSC వెబ్‌సైట్ నుంచి ఫార్మాట్ డౌన్‌లోడ్ చేసి, తమకు అభ్యంతరాలున్న ప్రశ్నలు లేదా జవాబులను రాసి, దీనికి హాల్‌టిక్కెట్ జిరాక్స్ కాపీ జతచేయాలని సూచించింది. వీటిని మే 2 సాయంత్రం 5.00 గంటల్లోగా పోస్టు ద్వారా పంపాలని పేర్కొంది.