ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులకు మార్కెట్ లో ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది ఉన్నత విద్య వైపు వెళ్లాలనుకుంటారు, మరికొందరు జాబ్ చేయాలని అనుకుంటారు. కొంతమంది ఈ రెండిటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? బీటెక్ తరువాత ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బీటెక్ తరువాత చేయగలిగే బెస్ట్ కోర్సులు:
బీటెక్ తరువాత ME/M.Tech లాంటి చదువులు మంది ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇందుకోసం GATE ఎక్జామ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తయ్యాక Teaching jobs, R&D విభాగాలు, PSU లలో ఉద్యోగాలు చేసుకోవచ్చు.
బీటెక్ తరువాత బిజినెస్, మానేజ్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే MBA మంచి ఆప్షన్. ఇందుకోసం CAT, MAT, GMAT లాంటి ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. Project Manager, Business Analyst, Operations Manager లాంటి ఉద్యోగా అవకాశాలు ఉంటాయి.
బీటెక్ తరువాత విదేశాల్లో MS చేయడానికి కూడా మంచి అవకాశం ఉంది. USA, Germany, Canada లాంటి సీట్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకోసం GRE, TOEFL/IELTS లాంటి ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ డిగ్రీ, లక్షల్లో ఆదాయం ఉండే ఉద్యోగ అవకాశాలు.
బీటెక్ తరువాత PG Diploma కోర్సులు కూడా మంచి ఆప్షన్ గా చెప్పొచ్చు. అందులో Artificial Intelligence (AI), Data Science, Cyber Security, Cloud Computing, Robotics లాంటి అద్భుతమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సివిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి IAS/IPS లాంటి అవకాశాలు ఉన్నాయి.
బీటెక్ తరువాత ముఖ్యమైన ఉద్యోగ అవకాశాలు:
ప్రైవేట్ కంపెనీ IT & Core Sectors ఉద్యోగాలు. TCS, Infosys, Wipro, Accenture, Cognizant, HCL లాంటి టాప్ కంపెనీలలో జాబ్స్. Software Developer, QA Tester, System Analyst, Support Engineer లాంటి ఉద్యోగాలు చేసుకోవచ్చు.
కొర్ సెక్టార్స్ లో మంచి జాబ్స్ ఉన్నాయి. L&T, BHEL, GAIL, NTPC వంటి సంస్థల్లో లక్షల ఆదాయం వచ్చే జాబ్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం మంచి GATE స్కోర్ ఉంటే PSU లలో స్థిర ఉద్యోగం పొందవచ్చు.
Public Sector Units లో కూడా అద్భుతమైన జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. మంచి నాలెడ్జ్ ఉంటె అద్భుతమైన ఆదాయం పొందవచ్చు.
రక్షణ రంగంలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, DRDO, ISRO, BARC లాంటి పరిశోధనా సంస్థలు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి.
బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. IBPS, SBI PO, RRB, SSC JE, SSC CGL లాంటి పరీక్షల ద్వారా ఉద్యోగం, మంచి శాలరీ పొందవచ్చు.