10th అర్హతతో : BSF లో 317 ఉద్యోగాలు

  • Publish Date - February 24, 2020 / 06:25 AM IST

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో గ్రూప్ B, గ్రూప్ C కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ కింద పలు రకాల పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తంగా 317 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
ఎస్ఐ మాస్టర్ – 5
ఎస్ఐ ఇంజన్ డ్రైవర్ – 9
ఎస్ఐ వర్క్ షాప్ – 3
హెడ్ కానిస్టేబుల్ మాస్టర్ – 56
హెడ్ కానిస్టేబుల్ ఇంజన్ డ్రైవర్ – 68
మెకానిక్ – 7
ఎలక్ట్రీషియన్ – 2
ఏసీ టెక్నీషియన్ – 2
ఎలక్ట్రానిక్స్ – 1
మెషినిస్ట్ – 1
కార్పెంటర్ -1
ఫ్లంబర్ – 16
సిటీ(క్రూ) – 160

విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

వయసు : ఎస్ఐ పోస్టు అభ్యర్దుల వయసు 22 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టుల అభ్యర్దుల వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు : ఎస్ఐ పోస్టుకు దరఖాస్తు చేయు అభ్యర్దులు రూ.200 చెల్లించాలి. హెడ్ కానిస్టేబుల్, ఇతర పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్దులు రూ.100 చెల్లించాలి.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 15, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 15, 2020.