CBSE టెన్త్ రిజల్ట్స్: 13 మంది స్టూడెంట్స్ కు 499/500

  • Publish Date - May 6, 2019 / 10:18 AM IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 6వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించారు. 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 4.40 శాతం అధికంగా పాస్ పర్సంటేజీ పెరిగింది.

ఫలితాల్లో మొత్తం 13 మంది విద్యార్థులు 500 మార్కులకు 499 సాధించారు. వీరిలో 8 మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఉండటం విశేషం. 25 మంది విద్యార్థులు 498 మార్కులు, 59 మంది విద్యార్థులు 497 మార్కులు సాధించారు. 57వేల 256 మంది విద్యార్థులు 95% పైగా మార్కులు సాధించారు. 2లక్షల 25వేల 143 మంది విద్యార్థులు 90 నుంచి 95% మధ్య మార్కులు సాధించటం ఈసారి విశేషం. CBSE టెన్త్ రిజల్ట్స్ కోసం cbseresults.nic.in వెబ్ సైట్ ను విజిట్ చేయండి.