పదోతరగతి తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం (మే 6న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదలకానున్నాయి. మార్కులకు బదులు గ్రేడింగ్ విధానంలోనే పదోతరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించనుంది. ఫలితాలను cbseresults.nic.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను ఆయా వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు. గతేడాది CBSE పదోతరగతి ఫలితాలను మే 29న విడుదల చేశారు. 2017 ఫలితాలతో పోలిస్తే 2018లో తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. 2017లో 90.95 శాతం విద్యార్థులు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు పదోతరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు 12వ తరగతి పరీక్షలను CBSE నిర్వహించిన సంగతి తెలిసిందే. 10, 12వ తరగతి పరీక్షలకు మొత్తం 31,14,821 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 12 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరుకాగా 18 లక్షల మంది విద్యార్థలు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు.