CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 91.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇది 2019 కంటే 0.36 శాతం అధికమని సీబీఎస్ఈ ప్రకటించింది.
ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ cbseresult.nic.in లో చూడవచ్చని బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 18 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ నిర్వహిస్తామని సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
సీబీఎస్ఈ విడుదల చేసిన ఫలితాల్లో తిరువనంతపురం, చెన్నై, బెంగళూరు జోన్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 99.28 శాతంతో తిరువనంతపురం మొదటిస్థానంలో నిలవగా, గువాహటి చివరి స్థానంలో నిలిచింది.