Asia Cup 2025 : ఆసియాక‌ప్‌లో భార‌త్‌ను చిత్తుగా ఓడిస్తాం.. జ‌ట్టు ప్ర‌క‌ట‌న త‌రువాత పాక్ సెల‌క్ట‌ర్ వ్యాఖ్య‌లు..

ఆసియాక‌ప్ (Asia Cup 2025 )కోసం పాకిస్తాన్ జ‌ట్టును ప్ర‌క‌టించిన క్ర‌మంలో ఆ జ‌ట్టు సెల‌క్ట‌ర్ ఆకిబ్ జావేద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Asia Cup 2025 : ఆసియాక‌ప్‌లో భార‌త్‌ను చిత్తుగా ఓడిస్తాం.. జ‌ట్టు ప్ర‌క‌ట‌న త‌రువాత పాక్ సెల‌క్ట‌ర్ వ్యాఖ్య‌లు..

PCB chief selector Aaqib Javed key comments on IND vs PAK match in Asia Cup 2025

Updated On : August 18, 2025 / 5:20 PM IST

Asia Cup 2025 : ఆసియాక‌ప్ 2025 కోసం పాకిస్తాన్ జ‌ట్టును ప్ర‌క‌టించిన క్ర‌మంలో ఆ జ‌ట్టు సెల‌క్ట‌ర్ ఆకిబ్ జావేద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. స్టార్ ఆట‌గాళ్లు బాబ‌ర్ ఆజామ్‌, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌లు లేకున్నా కూడా పాక్ జ‌ట్టు టీమ్ఇండియాను ఓడిస్తుంద‌న్న ధీమాను వ్య‌క్తం చేశాడు.

ఆసియాక‌ప్ 2025 (Asia Cup 2025) బ‌రిలోకి దిగే పాక్ జ‌ట్టును ఆదివారం ప్ర‌క‌టించారు. 17 మందికి ఈ జ‌ట్టులో చోటు ఇచ్చారు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన బాబ‌ర్ ఆజామ్‌, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, న‌సీమ్ షాల‌కు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. స్టార్ ఆల్‌రౌండ‌ర్ సల్మాన్ అలీ అఘా నాయ‌క‌త్వంలో పాక్ బ‌రిలోకి దిగ‌నుంది.

Rinku Singh : తొలి బంతికే వికెట్ తీసిన రింకూ సింగ్‌.. వామ్మో ఆ ఆవేశం ఏందీ బ్రో.. వీడియో

జ‌ట్టు ప్ర‌క‌ట‌న అనంత‌రం ఆకిబ్ జావేద్ మీడియాతో మాట్లాడాడు. ఆసియాక‌ప్‌లో భార‌త్‌ను ఓడించే స‌త్తా పాక్ జ‌ట్టుకు ఉంద‌న్నాడు. ప్ర‌పంచంలో అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన పోరు భార‌త్‌, పాక్ జ‌ట్ల మ‌ధ్యే జ‌రుగుతుంది. ఈ విష‌యం అంద‌రికి తెలుసున్నాడు. త‌మ జ‌ట్టు ఎవ‌రినైనా ఓడిస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. ప్ర‌తి ఒక్క ఆట‌గాడు కూడా ఈ టోర్నీకి సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పాడు. ఆట‌గాళ్ల పై తాము అద‌న‌పు ఒత్తిడి ఉంచాల‌ని అనుకోవ‌డం లేద‌న్నాడు.

సీనియ‌ర్ ఆట‌గాళ్లు అయిన బాబ‌ర్ ఆజామ్‌, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, న‌సీమ్ షాలు టీ20 జ‌ట్టులో రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉందా ? అన్న ప్ర‌శ్న‌కు ఇలా బ‌దులు ఇచ్చాడు. తాము ఆట‌గాళ్ల ఫామ్ ప్ర‌కార‌మే జ‌ట్టును ఎంపిక చేశామ‌ని చెప్పాడు. ఎవ‌రైనా స‌రే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తే జ‌ట్టులో చోటు ల‌భిస్తుంద‌న్నాడు.

Sanju Samson Net Worth 2025 : సంజూ శాంస‌న్ ఆస్తి ఎంతో తెలుసా? కోట్లలో జీతం.. రాజభవనం లాంటి ఇల్లు.!

ఆసియా కప్ 2025కి పాకిస్తాన్ జట్టు ఇదే..
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం, సల్మాన్ మీర్జా, షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.