పది పాసైన వారికి స్కాలర్ షిప్… ఏడాదికి రూ. 6వేలు, అర్హతలు ఇవే!

  • Publish Date - November 13, 2020 / 09:41 AM IST

CBSE Scholarship Scheme for Single Girl Child : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్(single girl child) స్కాలర్ షిప్ ల మంజూరుకు దరఖాస్తులను కోరుతుంది. పదో తరగతి పాసైన విద్యార్ధులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. అయితే…. సీబీఎస్ఈ స్కూల్ అనుబంధ పాఠశాలల్లో మాత్రమే పది పూర్తి చేసిన విద్యార్దులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థినులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నట్లు బోర్డు తెలిపింది.



ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. అర్హత కలిగిన విద్యార్దులు CBSE వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని బోర్డు వెల్లడించింది. ఈ స్కాలర్ షిప్ రిజిస్ట్రేషన్ కు డిసెంబర్ 10, 2020 చివరి తేదీ. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు డిసెంబర్ 10 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.



రెన్యువల్ చేసుకునే వారు మాత్రం హార్డ్ కాపీని డిసెంబర్ 28,2020 నాటికి పంపించాలని చెప్పింది. గడువు ముగిసిన తర్వాత అందిన హార్డ్ కాపీని పరిగణలోకి తీసుకోబడవు అనే విషయాన్ని స్పష్టం చేసింది.



అర్హతలు ఇవే…
> దరఖాస్తు చేసుకునే విద్యార్ధిని తల్లిదండ్రులకు ఏకైక సంతానం అయి ఉండాలి.

> సీబీఎస్ఈ అనుబంధ పాఠశాల్లో పదో తరగతి 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.

> సీబీఎస్ఈ అనుబంధ సంస్థల్లో ఇంటర్ చదువుతున్న వారు మాత్రమే అర్హులు.

> 10వతరగతిలో వారి ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 మించి ఉండరాదు.

ట్రెండింగ్ వార్తలు