CBSE To Soon Release Date Sheet For 2025 Board Exams
CBSE Date Sheet : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ చివరి నాటికి 10వ తరగతి, 12 తరగతుల బోర్డు పరీక్షల డేట్ షీట్‌ను విడుదల చేయనుంది. బోర్డు సాధారణంగా పరీక్ష తేదీలను నవంబర్ నెలాఖరులోగా ప్రకటించనుంది.
గత ప్రకటనల ప్రకారం.. 10వ తరగతి, 12 తరగతులకు 2025 బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15, 2025 నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. సీబీఎస్ఈ ఇంకా బోర్డుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనప్పటికీ, సీబీఎస్ఈ మునుపటి నోటిఫికేషన్ ఆధారంగా పరీక్ష తేదీపై అనేక అంచనాలు నెలకొన్నాయి. సీబీఎస్ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమై.. ఏప్రిల్‌లో సీబీఎస్ఈ పరీక్షలు ముగిసే అవకాశం ఉంది.
2023 నుంచి సీబీఎస్ఈ ఫిబ్రవరి 15న బోర్డు పరీక్షను నిర్వహిస్తోంది. 2021లో మే 4 నుంచి జూన్ 7న, 2022లో బోర్డు పరీక్ష ఏప్రిల్ 26 నుంచి మే 24లో నిర్వహించింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి డేట్ షీట్, పరీక్ష తేదీలు, సమయాలు, విద్యార్థులకు సాధారణ సూచనలతో పాటు సీబీఎస్ఈ ఇటీవలే 10వ తరగతి, 12వ తరగతిలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది.
10వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్ జనవరి 1, 2025 నుంచి నిర్వహించనున్నారు. అయితే, ఫిబ్రవరి 15, 2025 నుంచి సీబీఎస్ఈ 12వ తరగతి ప్రాక్టికల్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే బోర్డు.. థియరీ, ప్రాక్టికల్, ప్రాజెక్ట్, ఐఏలో మార్కుల విభజనకు సంబంధించి ఒక సర్క్యులర్‌ను కూడా విడుదల చేసింది. 12వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షను ఎక్స్‌ట్రనల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే, తరగతి 10 ప్రాక్టికల్ పరీక్షలను పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో మాత్రమే నిర్వహిస్తారు.
Read Also : CBSE CTET Exam Date : సీబీఎస్ఈ సీటెట్ ఎగ్జామ్ కొత్త డేట్ ఇదే.. ఈ నెల 16వరకే దరఖాస్తుకు ఛాన్స్..!