భారత ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అస్సాం , హిమాచల్ ప్రదేశ్, తెలంగాణాలోని యూనిట్లలో పనిచేయాలి.
Read Also : స్వరం మారింది : పవన్ కింగ్ మేకర్ అవుతారా
ఖాళీలు : అడిషనల్ జనరల్ మేనేజర్ – 2 (టెక్నికల్). డిప్యూటి జనరల్ మేనేజర్ – 2 (ప్రాజక్ట్స్ – 1, ఆపరేషన్స్ -1). సీనియర్ మేనేజర్ – 1 (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్). మేనేజర్ – 5 (మైనింగ్ -2 , హెచ్ఆర్ – 2, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ – 1). డిప్యూటి మేనేజర్ – 6 (మెకానికల్ – 1, ప్రొడక్షన్ – 3, ఇన్‌స్ట్రుమెంటేషన్ – 1, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ – 1)
అర్హత : టెక్నీకల్, ప్రాజెక్టు పోస్టులు – ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ. ఆపరేషన్ పోస్టులు – కెమికల్ / మెకానికల్ విభాగంలో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ. మైనింగ్ పోస్టులు – మైనింగ్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ. ప్రొడక్షన్ పోస్టులు – కెమికల్ ఇంజినీరింగ్ / ఎంఎస్సీ (కెమిస్ట్రీ),. ఇన్‌స్ట్రుమెంటేషన్ పోస్టులు – ఎలక్ర్టానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.
వయస్సు : అడిషనల్ జనరల్ మేనేజర్ పోస్టులకు గరిష్టంగా 50 ఏళ్లు. డిప్యూటి జనరల్ మేనేజర్ 48 ఏళ్లు. సీనియర్ మేనేజర్ పోస్టుకు 46 ఏళ్లు. మేనేజర్ పోస్టులకు 44 ఏళ్లు. డిప్యూటి మేనేజర్ పోస్టులకు 42 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు.
ఎంపిక : రాతపరీక్ష / గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు లాస్ట్ డేట్ : ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలకు : www.cciltd.in