సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతతోపాటు.. సంబంధిత క్రీడా విభాగంలో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత:
అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది. సంబంధిత క్రీడలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయి గుర్తింపు ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్ధులు ఆగస్ట్ 1, 2019 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
అభ్యర్ధులను ట‌్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెరిట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 25వేలకు పైగా జీతం ఇస్తారు.
దరఖాస్తు చివరితేది: డిసెంబర్ 17, 2019.
Read Also: పదో తరగతి పాస్ అయితే చాలు : సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 4వేల ఉద్యోగాలు