కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ (CSL) నుంచి కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా వర్కమెన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలు చేసింది. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 671 ఖాళీలు ఉన్నాయి. ఇందులో భాగంగా షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఫిట్టర్, మెకానిక్, పెయింటర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను బట్టి ITI లో మార్కులు, NAC మార్కులు, ప్రాక్టికల్ టెస్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్ధులకు పోస్ట్ ను బట్టి జీతం 18వేల నుంచి ఉంటుంది. ఎక్స్ ట్రా అవర్స్ వర్క్ చేస్తే దానికి కూడా సాలరీ ఇస్తారు.
విద్యార్హత:
అభ్యర్ధులు పదోతరగతి మరియు సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్.. ITI చేసి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్ధులకు 30 ఏళ్లకు మించి ఉండకూడదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్ధులకు రూ.100 చెల్లించాలి. SC, ST అభ్యర్ధులు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 30, 2019.
దరఖాస్తు చివరితేది: నవంబర్ 15, 2019.