CUET UG 2024 : సీయూఈటీ యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల.. ఈ నెల 9వరకు అభ్యంతరాల స్వీకరణ!
CUET UG 2024 : సీయూఈటీ పరీక్షలో హాజరైన అభ్యర్థులు సీయూఈటీ అధికారిక వెబ్సైట్ని ఉపయోగించి ఆన్సర్ కీని యాక్సెస్ చేయవచ్చు.
CUET UG 2024 Provisional Answer Key Released, Raise Objections Until July 9 ( Image Source : Google )
CUET UG 2024 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2024 కోసం ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది.
సీయూఈటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ని ఉపయోగించి ఆన్సర్ కీని యాక్సెస్ చేయవచ్చు. పరీక్షా ఏజెన్సీ ప్రశ్న పత్రాలు, ఆన్సర్ కీతో పాటు పరీక్షకుల రెస్పాన్స్ కీలను కూడా జారీ చేసింది.
సీయూఈటీ అభ్యర్థులు జులై 9 సాయంత్రం 5 గంటల వరకు ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఒక్కో ప్రశ్నకు రూ. 200 రీఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ. 200 రీఫండబుల్ ప్రాసెసింగ్ రుసుముతో పాటు సమర్పించాలి.
అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్టీఏ మూల్యాంకనం చేస్తుంది. చెల్లుబాటు అయ్యేవిగా గుర్తిస్తే, ఫైనల్ ఆన్సర్ కీ జారీ అవుతుంది.
సెంట్రల్, ఇతర భాగస్వామ్య యూనివర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష మే 15, 16, 17, 18, 21, 22, 24, 29 తేదీలలో 379 స్థానాల్లో జరిగింది. ఈ ఏడాదిలో మొదటిసారిగా ఎన్టీఏ హైబ్రిడ్ ఫార్మాట్లో పరీక్షను నిర్వహించింది.
Display of Provisional Answer Keys, Question Paper, and Scanned Images of OMR Sheets with Recorded Responses for Answer Key Challenge for Common University Entrance Test [CUET (UG)] – 2024 pic.twitter.com/lLJX1tZNzT
— National Testing Agency (@NTA_Exams) July 7, 2024
షెడ్యూల్ ప్రకారం.. తాత్కాలిక సమాధానాల కీని జూన్ 30న విడుదల చేయాలని నిర్ణయించారు. ఎన్టీఏ ప్రకారం.. ఆన్సర్ కీ విషయంలో జాప్యం జరిగింది. ఆలస్యం కారణంగా పరీక్షకు హాజరైన 9,68,201 మంది విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
ఈ సంవత్సరం, 6,60,311 మంది మహిళా అభ్యర్థులతో సహా 14,90,293 మంది విద్యార్థులు సీయూఈటీ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 261 యూనివర్శిటీల్లో సీయూఈటీ యూజీ 2024 స్కోర్లను అనుమతిస్తాయి.
Read Also : CBSE Admit Cards : సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల.. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి!
