భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ ఆఫ్ హైకోర్టు లో గ్రూప్-C కింద కొన్ని రకాల పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్, రిస్టోరర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 132 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత : అభ్యర్దులు డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్, నిమిషానికి 35 పదాలు టైపింగ్ చేయగల సామర్ధ్యం కలిగి ఉండాలి.
వయసు : అభ్యర్దుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసీ, EWS అభ్యర్దులు రూ.600 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులు, ఎక్స్- సర్వీసెస్ మెన్ అభ్యర్దులు రూ.300 చెల్లించాలి.
ఎంపికా విధానం : అభ్యర్దులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంగ్లీష్ టైపింగ్ టెస్టు, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 19, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 11, 2020.