సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగులు టార్గెట్ బేసడ్ గా ఉంటాయి. కంపెనీ యాజమన్యం నిర్దేశించిన టార్గెట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగులు టార్గెట్ బేసడ్ గా ఉంటాయి. కంపెనీ యాజమన్యం నిర్దేశించిన టార్గెట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యోగులు తమకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తిచేసేందుకు కిందామీదా పడుతుంటారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతేకాదు.. ఇచ్చిన సమయానికి టార్గెట్ పూర్తవ్వకపోతే జీతంలో కోత కూడా విధిస్తారు. ఇంకా కంపెనీ రూల్స్ కొంచెం కఠినంగా ఉంటే ఉద్యోగంలో నుంచే తొలగిస్తారు. కానీ, మీరు ఇప్పుడు చదవబోయే ఈ వార్త అందుకు భిన్నం. చరిత్రలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని శిక్ష విధించిందో చైనా కంపెనీ.
ఇయర్ ఎండింగ్ టార్గెట్ పూర్తి చేయలేదని తమ కంపెనీల్లో ఉద్యోగులపై కర్కశంగా ప్రవర్తించింది. ఉద్యోగులపై ఎంతమాత్రం జాలిదయ లేని ఆ చైనా కంపెనీ.. వారిని నడి రోడ్డు మీద మోకాళ్లపై నడిపించింది. ట్రాఫిక్ మద్యలో సిబ్బంది అంతా మోకళ్లపై కూర్చోని పాకుతూ వెళ్లారు. ఇదంతా అక్కడి వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా ఆ వీడియో వైరల్ అయింది. ఉద్యోగులను హింసిస్తున్నారని, వారిని అవమానించేలా కంపెనీ వ్యవహరిస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని విమర్శిస్తున్నారు. వైరల్ అయిన వీడియోతో యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో కంపెనీని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది.
This Chinese company has a humiliating punishment for employees who fail to meet their targets. pic.twitter.com/cVod5xyXvI
— SCMP News (@SCMPNews) January 16, 2019