ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోదించనున్నారు. ఇంగ్లీష్ మీడియానికి మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోదించనున్నారు. ఇంగ్లీష్ మీడియానికి మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 2021-22 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియానికి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుతూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదుల చేసింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం కింద అన్ని పాఠశాలలను ఆధునీకరిస్తున్నారు. పాఠశాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయడంతోపాటు మరమ్మతులు, అవసరమైన చోట నూతన భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. అన్ని తరగతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలు సరఫరా చేసేందుకు గానూ ఇదివరకే విద్యాశాఖ మంత్రి సురేష్.. విద్యాధికారులతో సమీక్షలు జరిపి, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సకాలంలో ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తీసుకరావాలని ఆదేశించారు. వచ్చే సంవత్సరం నుంచి ఏపీలోని అన్ని పాఠశాలాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం కానుంది.