SJVN Job Vacancies : కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ ఎస్ జేవీఎన్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
కంప్యూటర్ అధారిత పరీక్ష, రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ అధారంగా ఎంపిక చేస్తారు. నెలకు వేతనంగా 60వేల రూపాయలు చెల్లిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

SJVN Job Vacancies :
SJVN Job Vacancies : కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన హిమాచల్ ప్రదేశ్ లోని ఎస్జేవీఎన్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేపడుతున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎన్విరాన్ మెంట్, ఎఫ్ అండ్ ఏ హెచ్ఆర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంజినీరింగ్ డిగ్రీ, బీటెక్, సీఏ, బీఈ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు.
కంప్యూటర్ అధారిత పరీక్ష, రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ అధారంగా ఎంపిక చేస్తారు. నెలకు వేతనంగా 60వేల రూపాయలు చెల్లిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల పంపేందుకు జనవరి 1 , 2023 ను చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://sjvn.nic.in/ పరిశీలించగలరు.