గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజినీరింగ్ (GATE)- 2020 పరీక్ష అడ్మిట్ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గేట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శుక్రవారం (జనవరి 3, 2020) నుంచి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
గేట్‌లో వచ్చే స్కోరు ఆధారంగానే ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, యూనివర్సిటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 16న గేట్ ఫలితాలను వెల్లడించనున్నారు.
అయితే షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 1, 2, 8, 9 తేదీల్లో గేట్ 2020 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం:
> గేట్ పరీక్ష మొత్తం 25 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు.
పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు, టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.
> పరీక్ష సమయం 3 గంటలు. నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానాకి 0.33 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.