Government Jobs : డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం, జీతం లక్ష రూపాయలు.. పూర్తి వివరాలు

అభ్యర్థులు జనవరి 12లోపు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.

CSIR Recruitment 2023

మీరు డిగ్రీ పాస్ అయ్యారా? జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో 444 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 75 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 368 ఉన్నాయి.

ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. వయసు 33ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతం 45వేల నుంచి ఒక లక్ష 40వేల వరకు ఉంటుంది. అభ్యర్థులు జనవరి 12లోపు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. హైదరాబాద్ లో పరీక్షా కేంద్రం ఉంది. వెబ్ సైట్.. https://www.csir.res.in

Also Read : చాట్‌జీపీటీతో ఇలా రెజ్యూమ్‌ క్రియేట్ చేసుకోండి.. ఇంటర్వ్యూ షార్ట్‌లిస్ట్‌లో మీ పేరును చూసుకోండి..

సంస్థ – Council of Scientific and Industrial Research
పోస్టు పేరు – సెక్షన్ ఆఫీసర్(SO), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ASO)
పోస్టుల సంఖ్య – 444
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ – 2024 జనవరి 12
ఎంపిక ప్రక్రియ – స్టేజ్ 1, స్టేజ్ 2, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్
జీతం – సెక్షన్ ఆఫీసర్ (47,600రూపాయలు – 1,51,100 రూపాయలు)
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (రూ.44,900 – 1,42,400 రూపాయలు)
అఫీషియల్ వెబ్ సైట్ https://www.csir.res.in/
ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ – 2024 జనవరి 14

Also Read : ఆన్‌లైన్ మోసాలకు గూగుల్ మెసేజెస్ ఫీచర్‌తో చెక్ పెట్టొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?