రోజుకు 9 గంటల పని..ఉద్యోగులకు మోదీ షాక్

  • Publish Date - November 19, 2019 / 01:56 AM IST

దేశంలో 9 గంటల పని దినాన్ని ప్రవేశపెట్టే క్రమంలో భాగంగా కేంద్రం నిబంధనలు జారీ చేసింది. ఇప్పటి వరకు  కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు చేస్తున్న 8 గంటల పని ఇకనుంచి 9 గంటలుగా మారనుంది.  వేతనకోడ్-2019, అమలులో భాగంగా కనీస వేతనాలు, కరువు భత్యం, పనిగంటలు. తదితర కార్మిక హక్కులకు సంబంధించి కేంద్రం  నింబధనలు జారీ చేసింది.  కనీస వేతనాలను ఖరారు చేసేందుకు ఆరు ప్రమాణాలను రూపోందించింది.  ఈ నిబంధనలపై నోటిఫికేషన్  జారీ చేసిన కేంద్ర కార్మికశాఖ … వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు తమ అభిప్రాయాలను 2019,నవంబర్ నెలాఖరు లోగా rajiv.ranja76@gov.in, malick.blkash@gov.in కు ఈ మెయిల్ ద్వారా పంపించవచ్చని తెలిపింది. 

ప్రస్తుత కార్మిక చట్టాలు ప్రకారం 8  పని గంటలను ఒక రోజుగా  పరిగణిస్తున్నారు. అదనంగా  భోజన విరామం అరగంట పరిగణలోనికి తీసుకుంటే ఎనిమిదిన్నర గంటలు అవుతోంది. కానీ వేతన కోడ్ లో భాగంగా సాధారణ  పనిదినంగా పరిగణించాలంటే 9 గంటలని పేర్కోంది.  ఒకవేళ విరామ సమయం ఎక్కువ ఇచ్చినప్పుడు  12 గంటలు దాటి సాధారణ పనిదినం ఉండటానికి వీల్లేదని అంది.

ఒక కుటుంబంలో  నలుగురు సభ్యులకు కలిపి రోజుకు  కనీసం2700 కేలరీల ఆహారం, ఏడాదికి 6మీటర్ల వస్త్రం ప్రామాణికంగా నిర్ణయించనుంది.  ఈ రెండిటికీ అయ్యే ఖర్చులో 10 శాతాన్ని ఇంటి అద్దెగా,20 శాతాన్ని ఇంధనం, విద్యుత్తు ఇతర ఖర్చులుగా లెక్కించనుంది. కనీస వేతనంలో 25 శాతం పిల్లల విద్య, వైద్యం, వినోదం, ఇతర ఖర్చుల కింద తీసుకుని నిర్ణయించాలని  నిబంధనల్లో కార్మికశాఖ పేర్కోంది.