HALలో ఉద్యోగాలు… మే 15 చివరి తేదీ

  • Publish Date - May 13, 2019 / 12:46 PM IST

గుడ్ న్యూస్ ITI పూర్తి చేసి అప్రెంటీస్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి. అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాసిక్ డివిజన్ HALలో సంవత్సరం పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 826 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25న ప్రారంభమైంది. మే 15న ముగుస్తుంది.

ఖాళీల వివరాలు:

                పోస్టులు    ఖాళీలు
ITI ట్రేడ్ అప్రెంటీస్  561 
టెక్నీషియన్ అప్రెంటీస్ 137
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 103
టెక్నీషియన్-వొకేషనల్ అప్రెంటీస్ 25
మొత్తం  826

* దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 25, 2019
* దరఖాస్తు చివరి తేది: మే 15, 2019