దరఖాస్తు చేసుకోండి : HCL లో అప్రెంటీస్ ఉద్యోగాలు

  • Publish Date - December 30, 2019 / 05:05 AM IST

కోల్ కతా ప్రధాన కేంద్రంగా ఉన్న హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్(HCL) అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. మెుత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్  ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
ఫిట్టర్ – 45
ఎలక్ట్రీషియన్ – 35
వెల్డర్ – 04
మెషినిస్ట్ – 04
టర్నర్ – 04
కార్పెంటర్, ప్లంబర్ – 04
డ్రాప్ట్స్ మెన్ – 04

విద్యార్హత : అభ్యర్ధులు 10వ తరగతిలో 60 శాతం మార్కలతో పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో  ఐటీఐ  ఉండాలి. 

వయస్సు : అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపికా విధానం : అభ్యర్దులను రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరి తేది : జనవరి 20,2020.