అప్లై చేసుకోండి: HPCLలో టెక్నీషియన్ ఉద్యోగాలు

  • Publish Date - November 23, 2019 / 04:56 AM IST

వైజాగ్ లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌(HPCL)లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు:
ఆపరేషన్ టెక్నిషియన్ – 66.
బాయిలర్ టెక్నిషియన్ –  06.

ఎంపిక విధానం: 
రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
 
విద్యార్హత: డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్) పూర్తి చేసుండాలి.

రాతపరీక్ష విధానం:
ఇందులో భాగంగా జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. దేశవ్యాప్తంగా 5 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ముంబయి, విశాఖపట్నం, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీలో పరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: 
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. SC, ST అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు ప్రారంభం: నవంబరు 22, 2019. 
దరఖాస్తు చివరితేది: డిసెంబరు 21, 2019.