Job fair on August 7 in Prakasam district
నిరుద్యోగ నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం చాలా కష్టపడుతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు మరోసారి అలాంటి మెగా జాబ్ మేళాను నిర్వహించబోతుంది. ఆగస్టు 7వ తేదీన ప్రకాశం జిల్లాలోని దోర్నల బ్రహ్మరాంబ మల్లిఖార్జున డిగ్రీ కళాశాలలో ఈ జాబ్‌మేళా జరగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని అధికారులు తెలిపారు. కాబట్టి, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం, సందేహాల కోసం 9553945387 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.