IBPS Clerk అడ్మిట్ కార్డు రిలీజ్.. పరీక్ష ఎప్పుడంటే?

  • Publish Date - January 8, 2020 / 01:19 AM IST

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మెయిన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 7న విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం జనవరి 19న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP) ఎగ్జామినేషన్-IX ద్వారా IBPS పరిధిలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొత్తం 12వేలకు పైగా Clerk పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. 

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 612 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌ లో 777 పోస్టులను కేటాయించారు. అయితే డిసెంబరు 7,8, 14, 21 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ రాతపరీక్ష ఫలితాలు జనవరి 1న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనవరి 19న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం:
> మెయిన్ ప‌రీక్షలో మొత్తం 190 ప్రశ్నల‌కు గాను 200 మార్కులు ఉంటాయి.
> ఇందులో జ‌న‌ర‌ల్‌ ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నల‌కు 50 మార్కులు, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నల‌కు 40 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & కంప్యూట‌ర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నల‌కు 60 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నల‌కు 50 మార్కులు ఉంటాయి.
> ప‌రీక్ష రాసేందుకు 160 నిమిషాలు స‌మ‌యం కేటాయిస్తున్నారు. 

Read Also.. చెక్ ఇట్: పదోతరగతి ఫీజు చెల్లింపు గడువు పెంపు