IBPS Releases Notification For AFO Posta
బ్యాంకింగ్ జాబ్స్ కోసం చూస్తున్న నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ కేడర్ కింద 310 అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్ I) ఖాళీల భర్తీ కోసం నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 1 నుండి జూలై 21, 2025 వరకు అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. IBPS క్యాలెండర్ ప్రకారం AFO 2025 కోసం ప్రాథమిక పరీక్ష ఆగస్టు 30న, ప్రధాన పరీక్ష నవంబర్ 9, 2025న జరగనుంది.
వయోపరిమితి: ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వ్యవసాయం లేదా సంబంధిత రంగాలలో నాలుగు సంవత్సరాల డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీస్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, సెరికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఇతర అనుబంధ విభాగాలలో డిగ్రీ పూర్తి చేసినవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రాథమిక పరీక్ష. రెండవది ప్రధాన పరీక్ష. మూడవది ఇంటర్వ్యూ. ఈ మూడు రౌండ్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను తుది నియామకానికి పరిగణనలోకి తీసుకుంటారు.
వేతన వివరాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 మధ్యలో జీతం ఉంటుంది. పని చేస్తున్న బ్యాంకు నిబంధనల ప్రకారం భత్యాలు కూడా అందుతాయి.
దరఖాస్తు రుసుము: SC, ST, PwBD అభ్యర్థులు రూ.175, మిగిలిన అన్ని వర్గాల వారు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది.