IDBI లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు

  • Publish Date - April 1, 2019 / 08:12 AM IST

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖ‌ల్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల ఆధారంగా విద్యా అర్హతలను నిర్ణయించారు. సంబంధిత విభాగంలో BSC, PG, MBA, CFA విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఫీజు: 
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, దివ్యాంగులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.  

పోస్టుల వివరాలు :

                    పోస్టులు           సంఖ్య
జనరల్ మేనేజర్ (గ్రేడ్ – E)          01
డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ – D)           06
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ – C)          36
మేనేజర్ (గ్రేడ్ – B)          77
మొత్తం ఖాళీలు 

        120

వ‌యసు పరిమితి :
01.03.2019 నాటికి 35 నుంచి 45 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ స్క్రీనింగ్‌ పరీక్ష, గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.