దరఖాస్తు చేసుకోండి: ఇగ్నోలో MBA, PHD కోర్సుల్లో ప్రవేశాలు

  • Publish Date - March 16, 2020 / 06:15 AM IST

ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (IGNOU)లో MBA, PHDల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు దరఖాస్తులు ప్రారంభిస్తున్నట్లు డాక్టర్‌ ఎస్‌ ఫయాజ్‌ అహ్మద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23వ తేదీ లోగా ఆన్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 29న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వారు నిర్వహించనున్నట్లు తెలిపారు. SC, ST విద్యార్థులకు అడ్మిషన్‌ ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. ఇందుకు అభ్యర్ధులు కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తిర్ణులై ఉండాలి.  SC, ST విద్యార్థులకు 45శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 

పరీక్ష విధానం:
పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష రాసేందుకు సమయం 3గంటలు. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ లో 30, ఇంగ్లీష్ లో 50, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ లో 50, రీజనింగ్ లో 70ప్రశ్నలు అడుగుతారు. 

పరీక్ష కేంద్రాలు: 
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఆంధ్రప్రదేశ్ లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.