జాబ్ అలర్ట్ : టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

  • Publish Date - May 8, 2019 / 02:38 AM IST

భారతీయ రైల్వే శాఖ పలు విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ట్రాక్ మ్యాన్, గేట్ మ్యాన్, పాయింట్స్ మ్యాన్, హెల్పర్ రిపోర్టర్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్  విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. విద్యార్హత 10వ తరగతి లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి. లేదా సమానమైన నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఆన్ లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్
పరీక్ష విధానం : మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజినెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్ నెస్, కరెంట్ అఫైర్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలు, 90 నిమిషాల వ్యవధి.

అసిస్టెంట్ లోకో పైలెట్, టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నారు.
అర్హత : టెన్త్ పాస్+ఐటీఐ/డిప్లామా ఇన్ ఇంజినీరింగ్
వయసు : 28 ఏళ్లకు మించకూడదు
ఎంపిక ప్రక్రియ : ఆన్ లైన్ ఎగ్జామ్(రెండు దశలు). ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.

వెబ్ సైట్ : www.indianrailways.gov.in