నూతన విద్యా విధానాన్ని (NEP) నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. విద్యా వ్యవస్థలో FDI విధానంతో పాటు సైన్స్, టెక్నాలజీ విద్యార్థుల ఉద్యోగార్హతలు పెరిగేలా చర్యలు చేపడతమని చెప్పారు. అప్రెండిస్ షిప్ తో కూడిన కోర్సులు ప్రారంభిస్తామని, ఉన్నత విద్య అందుకోలేకపోతున్న పేదల కోసం ఆన్ లైన్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నిర్మల తెలిపారు. విద్య కోసం రూ.99,300 కోట్లు కేటాయించేలా ప్రతిపాదించినట్టు ఆమె తెలిపారు. విదేశాలకు ఆధునిక విద్య కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇండియాలోనే విద్యనభించేలా విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రభుత్వం పనిచేయనున్నట్టు నిర్మల చెప్పారు.
త్వరలో ఆన్ లైన్ డిగ్రీలు తీసుకునే విధానాన్ని తీసురానున్నట్టు తెలిపారు. టాప్ 100 NIRFర్యాంకుడ్ విద్యాసంస్థల్లో ఈ ఆన్ లైన్ డిగ్రీని ఆఫర్ చేయనున్నట్టు చెప్పారు. ఆసియా, ఆఫ్రికన్ విద్యార్థులు భారత్‌లో స్కాలర్ షిప్ కోసం IND-SAT పరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యా రంగంలో మంచి ఉపాధ్యాయులను ఆకర్షించేందుకు గొప్ప ఆర్థిక స్థితి అసవరం ఉందన్నారు. విద్యారంగం అభివృద్ధికి ECB, FDI విధానాలను తీసుకొస్తున్నట్టు తెలిపారు.
మొత్తంగా 150 ఉన్నత విద్యాసంస్థలు మార్చి 2021 నాటికి శిక్షణ కార్యక్రమాలు ఉండనున్నాయి. పట్టణ స్థానిక సంస్థల్లో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్టు తెలిపారు. టీచర్లు, నర్సులు, ప్యారామెడికల్ సిబ్బందికి భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో స్కిల్ డివలప్ మెంట్ మెరుగుపడేలా శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. మొత్తంగా రూ.3వేల కోట్లతో నైపుణ్య లోపాలున్న వారికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.