దరఖాస్తు చేసుకోండి: ఇస్రోలో ఇంజనీర్ జాబ్స్

  • Publish Date - September 27, 2019 / 05:16 AM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 21 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

అర్హత: 
అభ్యర్ధులు BE, B-TECH 65 శాతం మార్కులతో పాసై ఉండాలి. 

వయస్సు:
అభ్యర్ధులు 35 ఏళ్లు మించకూడదు. SC, ST, OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: 
అభ్యర్ధులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 56 వేలు జీతం ఉంటుంది. 

దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 24, 2019.

దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 14, 2019.

Read Also: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఉద్యోగాలు

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..