నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగిత పెరిగిపోయిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర IT శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగిత పెరిగిపోయిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర IT శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో 5 సంవత్సరాలలో 8.73 లక్షల ఉద్యోగాలను ఉత్పత్తి చేసిన ఐటీ రంగం.. ఉద్యోగ సమాచారంపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసింది అంటున్నరవిశంకర్ ప్రసాద్. ప్రస్తుతం IT రంగంలో ప్రత్యక్షంగా 41.40 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 1.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని తెలిపారు. “నేను నా డేటాను ఉపయోగించడం లేదు, నేను నాస్కామ్ సమాచారాన్ని ఇస్తున్నాను,” అని అతను చెప్పాడు.
Read Also : చంద్రబాబు సరికొత్త స్లోగన్ : టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలదే అట
నిరుద్యోగిత సంక్షోభం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్… తమ పదేళ్ల ఉన్న కాంగ్రెస్ పరిపాలనలో ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించాయో పూర్తి వివరాలు వెల్లడించాలని మంత్రి డిమాండ్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ తిరోగమన బాట పట్టిందని, ముఖ్యంగా అవినీతి రాజ్యమేలిందని ఆయన విమర్శలు గుప్పించారు.
2014-15లో ఐటీ, బీపీవో రంగాల్లో 2.18 లక్షల మందికి ఉపాధి లభించగా, ఆ తర్వాతి ఏడాదిలో 2.03 లక్షల మందికి, 2016-17లో 1.75 లక్షల మంది కి, 2017-18లో 1.05 లక్షల మందికి, 2018-19లో 1.72 లక్షల మందికి ఉపాధి లభించినట్లు నాస్కాం వెల్లడించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే అంతర్జాతీయంగా భారత ఎకానమీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. వీటన్నింటి ఫలితంగా మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతోంది‘ అన్నారు.
Read Also : చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి