JEE-2019 అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ శుక్రవారం (మే 3న) దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.షెడ్యూలు ప్రకారం మే 27న JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు. మే 9 దరఖాస్తుకు చివరి తేది.
పరీక్ష విధానం:
పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు.
విద్యా అర్హతలు:
* JEE మెయిన్స్ పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అన్ని అభ్యర్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ఎంపిక చేస్తారు.
* JEE అడ్వాన్స్‌డ్ -2019 పరీక్షలకు 2018 లేదా 2019 సంవత్సరాల్లో ఇంటర్ పాసై ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.