JEE అడ్వాన్స్‌డ్-2020: దరఖాస్తుకు 6రోజులే…

  • Publish Date - March 7, 2020 / 06:17 AM IST

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం మే 1 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు JEE నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది. అంటే దరఖాస్తుకు 6రోజులు మాత్రమే టైం ఉందని తెలిపారు. మే 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

ఇందుకు ఫీజు చెల్లింపునకు 7వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అవకాశముంది. మే 17న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష ఉంటుందని పేర్కొంది. జూన్‌ 8న పరీక్షల ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది. ఈసారి JEE మెయిన్‌లో అర్హత సాధించిన టాప్‌ స్టూడెంట్స్‌ని JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా తీసుకుంటామని పేర్కొంది.

ఇక 2020 నుంచి 21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో కనీసంగా 20 శాతం (2లక్షల 676) సూపర్‌ న్యూమరీ సీట్లను మహిళలకు కేటాయించేలా ఐఐటీల కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. గత ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం సీట్లకు అదనంగా ఈ సీట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.  తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

See Also | ఏపీలో మోగిన నగారా, మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు

ట్రెండింగ్ వార్తలు