JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం అవుతుంది. పరీక్ష మే 17న రెండు సెషన్లలో నిర్వహిస్తారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 జరుగుతుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
పూర్తి షెడ్యూల్
| యాక్టివిటీ | తేదీ, సమయం |
|---|---|
| విదేశీయులు, ఓసీఐ పీఐఓ అభ్యర్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ | ఏప్రిల్ 6న ఉదయం 10:00 నుంచి మే 2 రాత్రి 11:59 వరకు |
| జేఈఈ మెయిన్ 2026 అర్హత పొందిన అభ్యర్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ | ఏప్రిల్ 23 ఉదయం 10:00 నుంచి మే 2 రాత్రి 11:59 వరకు |
| ఫీజు చెల్లింపుకు చివరి తేదీ | మే 4 రాత్రి 11:59 |
| అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ | మే 11 ఉదయం 10:00 నుంచి మే 17, 2026 మధ్యాహ్నం 2:30 వరకు |
| జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష | మే 17 |
| పేపర్ 1 | ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు |
| పేపర్ 2 | మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు |
| అభ్యర్థుల ప్రతిస్పందనల కాపీ అందుబాటు | మే 21 సాయంత్రం 5:00 |
| ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల | మే 25 ఉదయం 10:00 |
| ఆన్సర్ కీపై అభ్యంతరాల గడువు | మే 25 నుంచి మే 26, 2026 |
| ఫైనల్ ఆన్సర్ కీ ఫలితాల ప్రకటన | జూన్ 1 ఉదయం 10:00 |
| ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2026 రిజిస్ట్రేషన్ | జూన్ 1 నుంచి జూన్ 2, 2026 |
| ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2026 పరీక్ష | జూన్ 4, 2026 |
| ఏఏటీ 2026 ఫలితాల ప్రకటన | జూన్ 7, 2026 |
| జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ 2026 కౌన్సెలింగ్ తాత్కాలిక ప్రారంభం | జూన్ 2 సాయంత్రం 5:00 |