2019, జనవరి 8 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన JEE Main పేపర్-1, పేపర్-2 పరీక్షల క్వశ్చన్ పేపర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జనవరి 14వ తేదీ సోమవారం రిలీజ్ చేసింది.
2019, జనవరి 8 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన JEE Main పేపర్-1, పేపర్-2 పరీక్షల క్వశ్చన్ పేపర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జనవరి 14వ తేదీ సోమవారం రిలీజ్ చేసింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పేపర్-1 పరీక్షను రోజుకు రెండు విడతలుగా.. మొత్తం ఎనిమిది సార్లు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. పేపర్-1కు సంబంధించి 8 క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు పేపర్-2 కు సంబంధించి మరో ప్రశ్నపత్రం ఉంది. ప్రశ్నపత్రాలతోపాటు విద్యార్థుల ఆన్సర్ షీట్స్‌ను కూడా వెబ్‌సైట్‌లో ఉంచింది.
జనవరి 17 వ తేదీ వరకు క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉంటాయని.. విద్యార్థులు వాటిని భద్రపరచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. జనవరి 16న జేఈఈ మెయిన్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేయనున్నట్లు తెలిపింది. జేఈఈ మెయిన్ రాతపరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 9.41 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలంది.
వెబ్‌సైట్: jeemain.nic.in