JEE మెయిన్ పేపర్-2 ఫైనల్ ‘కీ’ రిలీజ్

  • Publish Date - May 14, 2019 / 10:49 AM IST

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 14న JEE మెయిన్ పేపర్-2 పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ ‘కీ’ ని విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ ‘కీ’ ని అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. NTA జాతీయస్థాయి విద్యాసంస్థల్లో B.Arch, B.Planning కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతీ సంవత్సరం రెండుసార్లు JEE మెయిన్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పేపర్-1 ఫలితాలు విడుదల అయ్యాయి. పేపర్-2 ఫలితాలు కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు 1,80,052 అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే ఏప్రిల్ 7న రెండో విడతగా నిర్వహించిన JEE మెయిన్ పేపర్-2 పరీక్షకు మొత్తం 1,69,725 మంది హాజరయ్యారు.