Sbi
Job notification : బ్యాకింగ్ రంగంలో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ , డిప్యూటీ మేనేజర్, రిలేషన్ షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 13 నుండి అన్ లైన్ ధరఖాస్తులను స్వీకరించనుండగా, ధరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 2.
భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 50, సివిల్ ఇంజనీర్ 36, ఎలక్ట్రికల్ ఇంజనీర్ 10, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ 4, డిప్యూటీ మేనేజర్ 10, రిలేషన్ షిప్ మేనేజర్ 1, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్1 చొప్పున ఖాళీలున్నాయి.
ఇక విద్యార్హత విషయానికి వస్తే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్, ఎంబీఏ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు ఎంబిఏ లేదా రూరల్ మేనేజ్ మెంట్ పీజీడీఎం, అగ్రిబిజినెస్, రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ, ప్రొడక్ట్ మేనేజర్ పోస్టుకు ఎంబీఏతోపాటు, సంబంధిత సబ్జెక్టులో బీటెక్, డిఫెన్స్ బ్యాంకింగ్ డ్వైజర్ కు సంబంధించి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వారై ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆన్ లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మిగిలిన పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. అప్లికేషన్ ఫీజు 750 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు లేదు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.bank.sbi/careers మరియు www.sbi.co.in/careersలను పరిశీలించగలరు.