TGPSC Group 2 Update: టీజీపీఎస్సీ కీలక అప్డేట్.. గ్రూప్ 2 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మొదలు.. అభ్యర్థుల జాబితా విడుదల

TGPSC Group 2 Update: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీలో భాగంగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్ ను ప్రకటించింది.

TGPSC Group 2 Update: టీజీపీఎస్సీ కీలక అప్డేట్.. గ్రూప్ 2 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మొదలు.. అభ్యర్థుల జాబితా విడుదల

TGPSC Group 2 certificate verification begins from August 20

Updated On : August 14, 2025 / 11:21 AM IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీలో భాగంగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక ఆల అధికారిక ప్రకటన చేసింది. తాజా ప్రకటన మేరకు గ్రూప్ 2 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆగస్టు 20వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ ప్రక్రియ ఆగస్టు 23వ తేదీ వరకు కొనసాగనుంది.

నాంపల్లి తెలుగు వర్సిటీలో ఉదయం 10:30 గంటల నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ మొదలుకానుంది. వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in పొందుపరిచామని ప్రియాంక ఆల తెలిపారు. అలాగే కౌన్సిలింగ్ లో భాగంగా ఆగస్టు 18 నుంచి 25వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు ఎంపికచేసుకోవచ్చని, వెబ్‌ఆప్షన్ల నమోదు జాగ్రత్తగా చేసుకోవాలని ఆమె కోరారు.