అప్లై చేసుకోండి: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

  • Publish Date - September 23, 2019 / 11:44 AM IST

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 463 ఖాళీలున్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు ఒకటి లేదా రెండేళ్లు శిక్షణ కూడా ఉంటుంది.  

విద్యార్హతలు : అభ్యర్ధులు 10వ తరగతి, డిప్లమా పూర్తి చేసుండాలి. 

వయసు: అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులకు 28 ఏళ్లు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుకు 30 ఏళ్లు ఉండాలి.
 
ఎంపిక విధానం: అభ్యర్ధులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 20, 2019.

దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 11, 2019.

Read Also: 

ECILలో ఉద్యోగాలు: 200 జూనియర్ టెక్నికల్ పోస్టులు