ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు అభ్యర్ధులకు ఎటువంటి ఇంటర్వ్యూలు గానీ.. ఎగ్జామ్స్ గానీ లేవు. దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో సమయం లేదు. త్వరపడి ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే జాబ్ దక్కించుకోవచ్చు.
ఎంపిక విధానం:
BE, B-TECH మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 23 వేల జీతం ఇస్తారు.
విద్యార్హత:
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫస్ట్‌క్లాస్ లో పాసై ఉండాలి.
వయసు:
అభ్యర్ధులు 30 సంవత్సరాలకు మించి వయసు ఉండకూడదు.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోడానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 19, 2019,
దరఖాస్తు చివరితేది: సెప్టెంబర్ 30, 2019.