కరోనా ఎఫెక్ట్: LIC ప్రిలిమ్స్ పరీక్షలు వాయిదా

  • Publish Date - March 23, 2020 / 02:12 PM IST

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చేందుతుండటంతో ఇప్పటికే పదోతరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు లైఫ్ ఇన్సురెన్స్ కార్పరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రిలిమినరీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

కొద్దిరోజుల క్రితం అసిస్టెంట్ సిస్టెంట్ ఇంజనీర్స్ (AE), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO), ఆర్కిటెక్ట్ (AA) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్  చేయాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ సమయంలో LIC ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్టు LIC అధికారికంగా ప్రకటించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు కొత్త షెడ్యూల్ ప్రకటించేది లేదని స్పష్టం చేశారు.